ఈ-కార్ రేసులో నోటీసులకు రంగం సిద్ధం..! 1 d ago
ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏసీబీ దర్యాప్తు ఆధారంగా కేటీఆర్‌పై ఈడీ కేసు నమోదు చేసింది. మనీలాండరింగ్, ఫెమా ఉల్లంఘన కింద ఈడీ కేసు నమోదు చేసింది. ఏ1గా కేటీఆర్, ఏ2గా అర్వింద్, ఏ3గా బీఎల్ఎన్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేసింది. మరోవైపు ఫార్ములా ఈ- రేస్ కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుంది. నేడు ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ స్టేట్మెంట్ను అధికారులు రికార్డ్ చేయనున్నారు. హెచ్ఎమ్డిఏ, ఎమ్ఎయూడి లోని మరికొంత మందిని విచారించేందుకు ఏసీబీ సిద్ధమైంది. ఫార్ములా ఈ-రేస్ కు సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ ను ఏసీబీ పరిశీలించనున్నది. ఎఫ్ఈఓ నుంచి వచ్చిన ఈ మెయిల్స్, ఎల్ఎఫ్ఎ తో పాటు లావాదేవీల వివరాలు కూడా ఏసీబీ వెరిఫై చేయనున్నది. కేసులో ఉన్న వారికి నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. రెండు రోజుల్లో కేటీఆర్‌తో సహా అందరికీ ఈ సోమవారం నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.